మంత్రి అమిత్ షాకి రాజాసింగ్ లేఖ
30-07-2024 04:42 PM
హైదరాబాద్: కేంద్రహోంమంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తెలంగాణలో జరిగిన జీఎస్టీ పన్ను ఎగవేత కుంభకోణం కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ స్కామ్ లో వేయ్యి కోట్లు పైగా అవినీతి జరిగిందని ఆరోపించారు. మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రమేయం కూడా ఈ కేసులో ఉందని, దీనిపై లోతుగా విచారణ జరిపించాలని రాజాసింగ్ కోరారు. ప్రస్తుతం జీఎస్టీ కుంభకోణం కేసును సీఐడీ దర్యాప్తు చేస్తుంది.




