calender_icon.png 12 November, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలేశ్వరం త్రివేణి సంగమం వద్ద కొనసాగుతున్న వరద

30-07-2024 04:16:51 PM

మహదేవ్పూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ మండలం కాలేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఉభయ నదులు ఉగ్రరూపం దాల్చాయి. రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి కాలేశ్వరం త్రివేణి సంగమం పుష్కర ఘాట్లను తాకుతున్నాయి. దీంతో వరద ప్రవాహం 10.750 మీటర్ల మేర కొనసాగుతుంది. కాలేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజ్ కి 7,25,050 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగ అంతే స్థాయిలో 85 గేట్ల ద్వారా నీటిని అధికారులు దిగువ వదులుతున్నారు.