08-12-2025 02:30:56 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): బండ రామారం గాబ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుతోనే సాధ్యపడుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రేగటి రవి గౌడ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బండ రామారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రేగటి వెంకటేష్ ఇంటింటికి తిరుగుతూ, ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేగటి రవి గౌడ్ మాట్లాడుతూ స్నేహశీలి మృదుస్వభావి రేగటి వెంకటేష్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. దీనితో ఆయన గ్రామంలో సేవకుడిగా పని చేస్తారని అన్నారు.
బండ రామారం గ్రామ అభివృద్ధికి తాను స్వయంగా సుమారు 20 లక్షల వ్యయంతో నూతన డ్రైనేజీ నిర్మించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో నూతన సిసి రోడ్లు ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పునూతల జయశంకర్ రెడ్డి మాజీ సర్పంచ్ గడ్డం ఉప్పలయ్య రేగటి యాదగిరి, ఆకారపు ముత్యలింగం, ఆకారపు ఎల్లయ్య ,ఆకారపు సైదులు ఆకారపు రాములు తదితరులు పాల్గొన్నారు.