ప్రశ్నించే మా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. రాష్ట్ర రుణాలపై స్వల్పకాలిక చర్చ సమయంలో వాగ్వాదం నెలకొంది. ఈ సందర్భంతో సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... గ్రావిటీ ద్వారా నీరు వచ్చే ప్రాణహిత-చేవెళ్లను పక్కకు పెట్టి రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కూలిపోయే ప్రాజెక్టు కట్టారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీరు ఇచ్చే ప్రాజెక్టుగా కాళేశ్వరం చేపట్టారని, ఎక్కడి నుంచి నీరు తీసుకోవాలో నిర్థారించకుండానే డిండి ఎత్తిపోతల పథకం చేపట్టారని మండిపడ్డారు. ఇంజనీర్లను అడగకుండానే మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరే నిర్ణయాలు తీసుకున్నారు.
బీఆర్ఎస్ హయాంలో వాళ్లు చేసే పన్నులను ఎవరు అడిగే ప్రతిపక్షం ఉండొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తామ పార్టీలో చేర్చుకున్నారని దుషించారు. ఎవరిని అడగకుండానే విపరీతంగా ప్రాజెక్టుల అంచనాలు పెంచుకున్నారని, రూ.2 లక్షల కోట్లు ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ ను రూ.7 వేల కోట్లకు అమ్మేశారని బీఆర్ఎస్ ను విమర్శించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో ఉమ్మడిగా చర్చించి నిర్ణయాలు జరుగుతున్నాయని రాజాగోపాల్ రెడ్డి చెప్పారు. విపక్ష ఎమ్మెల్యేలను మాత్రమే కాదు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ కలవనీయకపోవడంతో ఎమ్మెల్యేలు ప్రజాభవన్ ముందు గంటలకొద్దీ పడిగాపులు కాశారని రాజాగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.






