13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్‌హెచ్‌వోను నియమించాలి

26-03-2026 01:58 PM

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్‌హెచ్‌వోను నియమించాలి

ప్రభుత్వం తాగునీటి సమస్యపై స్పందించాలి: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): రాష్ట్ర అసెంబ్లీలో జీరో అవర్ సందర్భంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ప్రజల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ప్రస్తావించారు. జిల్లా కేంద్రంలో విద్యా, వైద్య, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు, ఫ్లోటింగ్ పాపులేషన్ గణనీయంగా పెరిగిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్(Traffic Police Station) ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్‌హెచ్‌వోను నియమించాలని ముఖ్యమంత్రిని కలిసి కోరినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన జి.ఓను ముఖ్యమంత్రి జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఆ నిర్ణయాన్ని త్వరితగతిన అమలు చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నీటిపారుదల శాఖ అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసి నీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత మంత్రిని కోరినట్లు తెలిపారు.