1 May, 2026 | 11:29 AM

కొత్తపల్లి గ్రామ సమస్యలను పరిష్కరిస్తా

01-05-2026 10:19 AM

కాలినడకన గ్రామానికి చేరుకొని సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే

బోథ్, మే1(విజయక్రాంతి): బజార్హత్నూర్ మండలం లోని మారుమూల గిరిజన గ్రామమైన కొత్తపల్లి గ్రామానికి శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కాలినడకన చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులతో చర్చించారు. అర్థంతంగా నిలిచిపోయిన రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభించే విధంగా చూపిస్తామని గ్రామస్తుల కు హామీ ఇచ్చారు. డివిజన్ నిర్మాణం చేపట్టి ఇబ్బంది లేకుండా రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన మాన్కాపూర్ .డెడ్రా, గ్రామాలకు త్వరలోనే రోడ్డు పనులు మంజూరు చేస్తామన్నారు ఆయన వెంట స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.