24 August, 2026 | 3:16 AM

విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

24-08-2026 02:43 AM

కుబీర్ ఆగస్టు 24 ( విజయ క్రాంతి) తానూర్ మండలంలోని బోరేగాం గ్రామం బాలాజీ గుట్టపై దాదాపు 20 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేక భక్తులు, గ్రామస్తులు ఎదుర్కొంటు న్న ఇబ్బందులకు ఎమ్మెల్యే రామారావు పటేల్ పరిష్కార మార్గం చూపారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గ్రామానికి వచ్చిన సందర్భంగా బాలాజీ ఆలయానికి విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకె ళ్లారు.

విషయాన్ని వెంటనే  అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరడంతో మూడు రోజుల్లోనే ఏర్పాటు చేశారు . ఆదివారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సన్మానం చేశారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.