18-01-2026 02:22:48 AM
రంగారెడ్డి జనవరి 17( విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లాలోని ఆమన్ గల్, చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, షాద్ నగర్, శంకర్ పల్లి మున్సిపాలిటీల వార్డు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ రిజర్వేషన్ లు ఖరారు చేచినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డిపిఓ సురేశ్ మోహన్ లతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు.
జిల్లాలోని ఆమన్ గల్ మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులు, చేవెళ్ళ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులు, ఇబ్రహీం పట్నం మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డు లు, మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డులు, షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డులు, శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల స్థానాల కోసం ఎస్.టి, ఎస్టీ(మహిళా), ఎస్.సి, ఎస్సీ (మహిళా), బి.సి, బీసీ(మహిళా), అన్ రిజర్వుడు, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీల రిజర్వేషన్లను వీడియో రికార్డింగ్ మధ్యన, నిబంధనలను అనుసరిస్తూ ఖరారు చేశారు.
చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు ఇలా..
ఆమనగల్ (జనరల్), షాద్నగర్ (బిసి జనరల్), చేవెళ్ల జనరల్), మొయినాబాద్ (ఎస్సీ జనరల్), శంకర్ పల్లి (జనరల్), ఇబ్రహీంపట్నం (జనరల్) , కొత్తూరు (జనరల్) కేటాయించారు.
వార్డుల వారిగా చుస్తే..
ఆమన్‌గల్ మున్సిపాలిటీ పరిధిలో 7 వార్డులకు, చేవెళ్ళ మున్సిపాలిటి పరిధిలో 9 వార్డులకు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటి పరిధిలో 12 వార్డులకు, మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలో 13 వార్డులకు, షాద్ నగర్ మున్సిపాలిటి పరిధిలో 14 వార్డులకు, శంకర్ పల్లి మున్సిపాలిటి పరిధిలో 7 వార్డులకు మహిళా కేటగిరికీ కేటాయించినట్లు తెలిపారు. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్ కేటాయిం పులు చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. ఖరారైన రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు నివేదించినట్లు తెలిపారు.
రిజర్వేషన్ల ఖరా రు ప్రక్రియలో జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, డిపిఓ సురేశ్ మోహన్, పిడి మెప్మా వెంకట నారాయణ, అమన్ గల్, చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, షాద్ నగర్, శంకర్ పల్లి మున్సిపల్ కమిషనర్లు ఎస్.వెంకటేష్, ఏ.యోగేశ్, వి.సునీత, బి.సత్యనారాయణరెడ్డి, ఏం.శంకర్, ఎండికే మొయిజుద్దీన్, సిపిఐ నుండి పాలమాకుల జంగయ్య, పానుగంటి పర్వతాలు, సిపిఐ(ఏం) నుండి బోడ సామెల్, సిహెచ్. ఎల్లేష, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి చల్లా నర్సింహా రెడ్డి, బండారి అగీరెడ్డి, జంగారెడ్డి, బిఆర్‌ఎస్ నుండి మదుపు వేణుగో పాల్, నిట్టూ జగదీశ్వర్, వెంకట్ రెడ్డి, బిజెపి నుండి విజయ్ కుమార్, దేవేందర్ రెడ్డి, కొండా మధుకర్ రెడ్డి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.