calender_icon.png 18 January, 2026 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతగానోళ్లకు మాటలెక్కువ

18-01-2026 01:50:09 AM

  1. మారువేషంలో వచ్చినా గుర్తుపట్టి కర్రుకాల్చి వాత పెడతారు 
  2. పాలమూర్‌లో గత పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కొత్తది కట్టలే..
  3. పగటి కలలు కనకండి.. మీ కాలం చెల్లింది
  4. పాలమూరు సభలో సీఎం రేవంత్‌రెడ్డి 

* తెలంగాణ మీ అయ్య జాగీరు కాదు. మీ తాతలు ఇచ్చిన ఆస్తి కాదు. ఇది నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. పాలమూరులో ఇల్లు లేకపోయినా కేసీఆర్‌ను ఇక్కడి నుంచి పార్లమెంట్‌కు పంపించిన ఘనత మాకు దక్కుతుంది. అది మా చేతకానితనం కాదు. 

 సీఎం రేవంత్‌రెడ్డి 

మహబూబ్‌నగర్, జనవరి 17 (విజయక్రాంతి): మారువేషంలో వచ్చి మాయమాట లు చెప్పినవారిని  గుర్తుపట్టి కర్రు కాల్చి వాత పెడతారని  రాష్ర్ట ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పా టుచేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడా రు. పనులు చేయలేని చేతగానోళ్లంతా ఏవే వో మాట్లాడుతున్నారని, వారి తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. శాసన సభకు వచ్చి చేసింది ఏందో చెప్పాలంటే, ఫామ్ హౌస్‌లో కూర్చొని అప్పుడప్పుడు కాలం చె ల్లిన మాటలు మాట్లాడడం విడ్డూరంగా ఉం దన్నారు. గత పదేళ్ల కాలంలో కేసీఆర్ మాయమాటలు చెప్పుకుంటూ కాలం గడిపారని సీఎం విమర్శించారు.

2013లో నాడు విఠల్‌రావు అప్పటి ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాసరెడ్డి పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయడంలో చొరవ తీసుకున్నారని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుకు రూ. 25 వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చిన కేసీఆర్ ఉదండాపూర్ భూ నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని ప్రశ్నించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి భూ నిర్వాసితులకు నిధులు మంజూరు చేయాలని కోరారని, ఇప్పటికే కొంత ఇచ్చా మని తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలోని సంఘం బండ ప్రాజెక్టు వద్ద ఒక బండను పగలగొడితే పదివేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పినప్పటికీ రూ. 10  కోట్లను కూడా మంజూ రు చేయలేదని విమర్శించారు.

కృష్ణా నీళ్లు కల్వకుర్తి నుంచి దివంగత నేత జైపాల్‌రెడ్డి సొంత గ్రామమైన మాడుగుల వరకు భూసేకరణ చేయవలసి ఉన్నప్పటికీ రూ. 75 కోట్లు మంజూరు చేయలేదని, ప్రజాపాలన ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి ప్రారంభించాలని దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడిగారని జరిగిందని, ఆ సమయంలోనే వైఎస్ మన నుంచి దూరం కావడంతో ఆ పనులు ముందుకు పడలేదన్నారు. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నాడు 1,500 కోట్లు మంజూరు చేయించి, ఆ ప్రాంతాలకు జూరాల నుంచి నీరు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

మనకు స్వా తంత్య్రం వచ్చినప్పుడే అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్  నెహ్రూ నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులు నిర్మించి సాగు చేసేందుకు ఎంతో సేవ చేశారని తెలిపారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌కు ఇంజినీరింగ్, లా కళాశాలను ఇవ్వడం జరిగిందని ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలను రూ. 25 ఎకరాల స్థలంలో రూ. 200 కోట్లతో  ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు. వచ్చే ఏడాదిలో పు ట్రిబుల్ ఐటీ భవనాన్ని పూర్తి చేసుకుందామని సీఎం తెలియజేశారు.

పదేండ్లు అన్యాయమే.. 

 ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా మక్తల్, నారాయణపేటతో పాటు అత్యధిక నియోజకవర్గాల్లో మీ పార్టీ వారినే గెలిపించడం జరిగింది కదా,  పాలమూరుకు ఎం దుకు పదేండ్లు అన్యాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని సీఎం.. బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. మక్తల్ ఎత్తిపోతల పథ కానికి సంబంధించి మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికతో పాటు శివకుమార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఇప్పటికి 96% భూ సేకరణ పూర్తిచేయడం జరిగిందన్నారు. జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్న బ్రిడ్జి పైనుంచి రాకపోకలు ఎక్కువగా కొనసాగుతున్నాయని నూతనంగా బ్రిడ్జి మంజూరు చేయాలని కోరితే రూ. 123 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

నాడు ఈ జిల్లాలో గెలిచిన మం త్రు లు ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను ఒక్క మాటనైనా అడిగారా? అని ప్రశ్నించారు. ఎక్కడ అభివృద్ధి జరిగినా, ప్రజలకు ఎలాంటి సంక్షే మం అందించినా నాటి శుక్రాచార్యుడిలా కేసీఆర్ వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని సీఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. శుక్రాచార్యుడిలా ఎక్కడ య జ్ఞం చేసినా.. మంచి పనులు చేసినా ఎం దుకు బావ బామ్మర్దులు వారితో లొల్లి పెడుతున్నారని ప్రశ్నించారు. దెబ్బకు దెబ్బ తీయ డం పాలమూరు బిడ్డలకు తెలుసని ఇక్కడ మీ ఆటలు సాగమని హెచ్చరించారు. 

మీ కాలం చెల్లింది..

మారువేషంలో వచ్చిన మాయగాడిని పాలమూరు జిల్లా ప్రజలు గుర్తుపడతారని, కర్రు కాల్చి వాత పెడతారని సీఎం రేవంత్ రెడ్డి చమత్కరించారు. పదేండ్లు పాలించిన వారి కాలం చెల్లిందని అన్నారు. రూ. 20 లక్షల కోటల్లో ఈ పేద విద్యార్థులకు సంవత్సరానికి 2,000 కోట్లు ఖర్చుపెట్టి కార్పొ రేట్ కళాశాల విద్యార్థులతో పోటీపడేల మరింత ఉన్నతంగా చదువుకునే వారని, ఆ నిధులు ఎక్కడికి పోయాయని సీఎం ప్రశ్నించారు. ఆనాడు డీకే అరుణ, దామోదర రాజ నర్సింహ, జూపల్లి కృష్ణారావు మంత్రులుగా చేశారని 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేశారని తెలిపారు.

అందుకే ఎన్నికల సమయంలో నేను సవాల్ చేశానని, ఎక్కడైతే ఇందిర ఇండ్లు ఉంటాయో అక్కడే నేను ప్రచారం చేస్తానన్నానని గుర్తుచేశారు. మొద టి సంవత్సరంలోనే రాష్ర్టవ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లను 100 నియోజకవర్గాలలో డ బుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయ డం జరిగిందని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేయడంతో పాటు ప్రతి ఇంటికి రూ 5 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. పేదల ఇందిరమ్మ ఇండ్లకు రూ. 22,500 కోట్ల ను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. 

 మీ అయ్య జాగీరుకాదు.. 

 తెలంగాణ రాష్ర్టం మీ అయ్య జాగీరి కాదని, మీ తాతలు ఇచ్చిన ఆస్తి కాదని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పాలమూరులో ఇల్లు లేకపోయినా ఇక్కడి నుంచి పార్లమెంటుకు పంపించిన ఘనత మాకు దక్కుతుందన్నారు. మా చేతకానితనం కాదని, అలా అనుకుంటే ఎక్కడ కర్రు కాల్చివాత పెట్టాలో మాకు తెలుసు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముం దుకు సాగుతున్నామని, నచ్చితే వచ్చి అభినందించాలని లేకుంటే.. ఫామ్‌హౌస్‌లోనే ఉండాలని హెచ్చరించారు. ఎంపీగా వంశీచందర్ రెడ్డిని గెలిపించుకోవాలని.. డీకే అరు ణమ్మను ఓడ కొట్టాలని 14 సమావేశాలు పెట్టానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కానీ ప్రజలు అరుణమ్మను  ఆశీర్వదించారని  తెలిపారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ప్రతి సమస్యను పరిష్కరించుకోవడంలో కలిసిమెలిసి ముందుకు వెళ్తాం తప్ప, చిల్లర రాజకీ యాలు చేసి అభివృద్ధిని అడ్డుకోవడం జరుగదన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మన్నోళ్ల ను గెలిపించుకోవాలని సీఎం కోరా రు. అనంతరం 4281 మహిళా సంఘాల సభ్యులకు రూ. 356 కోట్ల బ్యాంకు లింకేజీ తో కూడిన రుణాలకు సంబంధించిన చెక్కు ను ముఖ్యమంత్రి లబ్ధిదారులకు అందించారు.

అంతకుముందు మహబూబ్‌నగర్ జిల్లాలోని చిట్టి బోయిన్పల్లి దగ్గర రూ. 200కోట్లతో నిర్మించనున్న త్రిబుల్ ఐటీ కళాశాల భవన నిర్మాణానికి, మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఎంవీఎస్ డిగ్రీ, పీజీ కళాశాలలో 200 కోట్లతో మహబూబ్‌నగర్ నియోజకవర్గం లో ఏర్పాటుచే యనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు, రూ 20.50 కోట్లతో ఎంవీఎస్‌డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదులకు, రూ. 220.94 కోట్లతో త్రాగునీటి మెరుగుపరచు పనులకు, పాలక సంస్థలో 603 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, 40 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాల భవనాల స్థాపనలకు.. జిల్లాలో మొత్తం 1284 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 

భగవంతుని స్వరూపం: యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

 పాలమూరు ప్రజల కలలను సహకారం చేసేందుకు సాక్షాత్తు భగవంతుడే తన స్వరూపాన్ని సీఎం రేవంత్ రెడ్డి రూపంలో పంపిం చారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 2008 సంవత్సరంలో బాసర ట్రిబుల్ ఐటీ ప్రారంభించు కోవడం జరిగిందని, తెలంగాణ రాష్ర్టంలో మొట్ట మొదటిసారిగా మన జిల్లాలోని త్రిబు ల్ ఐటీ కళాశాలను ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. తడి గుడ్డతో గొం తు కోసేవారి కాలం చెల్లిందని గత పది ఏళ్ల లో వారు చేసింది అదే అని అసహనం వ్యక్తం చేశారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని, సీఎం రేవం త్ రెడ్డి అడుగుజాడల్లో  నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. మట్టి పనికైనా మనోడే ఉండాలి అనే సామెతకు నిలువెత్తు నిదర్శనంలా సమిష్టిగా ఉంటి సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు జిల్లాను ఉన్నత స్థానంలో నిలుపుతామని తెలియజేశారు. 

 ట్రీపుల్ ఐటీ ఆవిషృ్కతం కావడం అదృష్టం: దామోదర రాజనర్సింహ 

పాలమూరు జిల్లాలో ట్రిపుల్ ఐటి ఆవిషృ్కతం కావడం అదృష్టమని సీఎం రేవంత్ రెడ్డి ద్వారానే ఇది సాధ్యమైందని రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ర్టవ్యాప్తంగా 16 నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేసుకున్నామని విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో గాడినపెట్టడం జరుగుతుందన్నారు. ఆదరణ లేని వ్యక్తులకు ఆశ్రయం కల్పించేందుకు 37 కేంద్రాలను రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బాల భరోసా, సామాజిక భద్రత, క్వాలిటీ విద్య ఇలా ప్రతి అంశాల్లోనూ సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకొని అభివృద్ధి వైపు అడుగులు వేయించడం జరుగుతుందన్నారు. 

సస్యశ్యామలం చేసే బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డి పై ఉంది: డీకే అరుణ, మహబూబ్‌నగర్ ఎంపీ

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్య త సీఎం రేవంత్ రెడ్డి పై ఉందని ఎంపీడీకే అరుణ అన్నారు.  కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు అనుసంధానమైతేనే అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందని స్పష్టం చేశారు. వికాసిత్ భారత్ -2047 కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి కూడా అత్యధిక నిధులు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట, వీరన్నపేట్ మోతినగర్‌తో పాటు తదితర ప్రాంతాలలో ఆర్‌ఓబి, ఆర్‌యుబీలను నిర్మించేందుకు 100% నిధుల ను కేంద్ర ప్రభుత్వం కేటాయించి పూర్తిచేయ డం జరుగుతుందన్నారు.

రోడ్లు నిర్మించ డంతోపాటు ప్రతి అంశంలోను కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలియజేశారు. గత ప్రభుత్వం గురుకులాలను ఏ ర్పాటుచేసి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని, సొంత భవనాలు నిర్మించే బాధ్యత కూడా రాష్ర్ట ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించడం మంచి విషయమని అన్ని రంగాలలో జిల్లాను ముందుకు తీసుకుపోయేందుకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పు డూ ఉంటాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి,జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, తుడి మెగా రెడ్డి,  రాజేష్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, సురభి వాణిదేవి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా, ఐఏఎస్ లు కృష్ణ భాస్కర్, నేవీ నికోలస్, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ఎస్పీ డీ జానకి,  శివేంద్ర ప్రతాప్, ఆర్డీఓ నవీన్ కుమార్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

విద్య ఉన్నతంగా నిలబెడుతుంది

అందుకు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి 

  1. యూపీఎస్సీ మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి ఆర్థిక సాయం
  2. పాలమూరు బిడ్డలు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కావాలి
  3. పుట్టిన గడ్డను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి
  4. విద్యార్థులతో ముఖాముఖిలో సీఎం రేవంత్‌రెడ్డి
  5. చిట్టబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన

మహబూబ్ నగర్, జనవరి 17 (విజయక్రాంతి): ‘విద్యార్థుల లక్ష్యం ఉన్నతంగా ఉం డాలి. అందుకు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. భాషను, జ్ఞానాన్ని పెంచుకోవ డానికి చిత్తశుద్ధితో పనిచేయాలి. మీలోని నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన విద్య మిమ్మ ల్ని సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యా లయం (త్రిబుల్ ఐటీ) కి శనివారం భూమిపూజ చేశారు. వచ్చే ఏడాదిలోపు ట్రిబుల్ ఐటీ భవనాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ప్రస్తావించిన అంశాలపై సీఎం స్పం దించి, విద్యకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయా లన్నదే ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఐఐఐటీతో పాటు ఇంజినీరింగ్, లా, మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యూపీఎస్సీ (సివిల్స్) రాసేవారిని ప్రోత్సహించేందుకు మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఎంపికైన యువతకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన ప్పుడు జమీందార్లు, జాగీర్దార్ల వద్ద ఉన్న భూములను తీసుకుని భూమిలేని నిరుపేదలకు అసైన్మెంట్ లేదా పోడు భూముల ప ట్టాలను ఇచ్చారు.

పేదలకు పంచేందుకు ఇప్పుడు భూములు లేవు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటేనే కష్టమైన పనిగా మారిందన్నారు. ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్య మా త్రమేనని, విద్య ఒక్కటే జీవితాన్ని మార్చగలదని వివరించారు. చదువుతోనే అభివృద్ధి చెందిన పౌరులుగా నిలదొక్కుకోగలుగుతారని చెప్పారు. పాలమూరు బిడ్డలు ఐఏఎ స్‌లు, ఐపీఎస్‌లు కావాలని, కేంద్ర స్థాయిలో కూడా మన వారు ఉంటే అధిక నిధులు మన ప్రాంతానికి తెచ్చుకునే అవకాశాలు ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీ స్థాయిలోనూ ఉన్నత చదువుల శిక్షణకు సైతం అవసరమైన నిధులను సమకూర్చుతామని తెలియజేశారు.

ఎవరు ఏ స్థాయి లోకి చేరుకున్నా పుట్టిన గడ్డను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అప్పుడే వారి జీవితం సార్థకమవుతుందని తెలిపారు. ‘25 ఏళ్ల వరకు కష్టపడి చదువుకోండి. చదువు మీకు సమాజంలో గౌరవా న్ని తెచ్చిపెడుతుంది. దేశంలో ఏ మూలకు వెళ్లినా తెలంగాణకు గుర్తింపు, గౌరవం తీసుకురావాలి. లక్ష్యాన్ని సాధించి సమాజానికి ఆదర్శవంతంగా నిలవాలి’ అని విద్యార్థులకు సూచించారు. మహబూబ్‌గర్ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించగా, 75 ఏళ్ల తర్వాత మళ్లీ జిల్లాకు అవకాశం వచ్చిందని, 2006లో జిల్లా పరిషత్ సభ్యుడి నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా చట్టసభల్లో పనిచేసిన తనకు పెద్దల సహకారంతో ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం లభించిందన్నారు.