మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
పది కార్పొరేషన్లలో 5 జనరల్, 3 బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి
121 మున్సిపాలిటీల రిజర్వేషన్లు కూడా వెల్లడి
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 121 మున్సిపాలి టీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సం బంధించిన మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఈసారి ఎన్ని కల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శా ఖ డైరెక్టర్ శ్రీదేవి అధికారికంగా ప్రకటించారు. కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ఎస్సీ సామాజిక వర్గానికి 1, ఎస్టీ సామాజిక వర్గానికి 1, బీసీలకు 3 కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఐదు స్థానాలకు గా నూ ఏకంగా నాలుగు స్థానాలను మహిళలకు కేటాయించారు.
121 మున్సి పాలిటీల్లో ఎస్సీ- సామాజిక వర్గానికి 17, ఎస్టీ సామాజిక వర్గానికి -5, బీసీలకు -38, జనరల్ కేటగిరీకి -61 కేటాయించారు. మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్ల రిజర్వేషన్ల తుదు జాబితాను ఆది వారం ఉదయానికల్లా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసే అవకాశం ఉంది. ప్రభుత్వం జీవో ఇచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎస్‌ఈసీ సిద్ధంగా ఉంది. ఒకటి, రెండు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న ట్టు సమాచారం.

మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లు
ఆదిలాబాద్ మహిళా జనరల్
అశ్వారావుపేట మహిళా జనరల్
పరకాల అన్ రిజర్వ్‌డ్
కోరుట్ల మహిళా జనరల్
రాయికల్ అన్ రిజర్వ్‌డ్
మెట్‌పల్లి అన్ రిజర్వ్‌డ్
ధర్మపురి మహిళా జనరల్
గద్వాల మహిళా జనరల్
ఎల్లారెడ్డి అన్ రిజర్వ్‌డ్
సత్తుపల్లి మహిళా జనరల్
వైరా మహిళా జనరల్
మధిర మహిళా జనరల్
జడ్చర్ల అన్ రిజర్వ్‌డ్
తొర్రూర్ అన్ రిజర్వ్‌డ్
మరిపెడ మహిళా జనరల్
క్యాతన్‌పల్లి మహిళా జనరల్
బెల్లంపల్లి మహిళా జనరల్
రామాయంపేట మహిళా జనరల్
నర్సాపూర్ మహిళా జనరల్
తూప్రాన్ మహిళా జనరల్
అలియాబాద్ మహిళా జనరల్
కల్వకుర్తి మహిళా జనరల్
చండూర్ అన్ రిజర్వ్‌డ్
నకిరేకల్ అన్ రిజర్వ్‌డ్
హాలియా అన్ రిజర్వ్‌డ్
మిర్యాలగూడ మహిళా జనరల్
చిట్యాల్ మహిళా జనరల్
నారాయణపేట మహిళా జనరల్
కొస్గి అన్ రిజర్వ్‌డ్
మక్తల్ అన్ రిజర్వ్‌డ్
ఖానాపూర్ అన్ రిజర్వ్‌డ్
భైంసా అన్ రిజర్వ్‌డ్
నిర్మల్ మహిళా జనరల్
భీంగల్ మహిళా జనరల్
ఆర్మూర్ మహిళా జనరల్
బోధన్ అన్ రిజర్వ్‌డ్
సుల్తానాబాద్ అన్ రిజర్వ్‌డ్
సిరిసిల్ల మహిళా జనరల్
శంకర్‌పల్లి అన్ రిజర్వ్‌డ్
చేవెళ్ల అన్ రిజర్వ్‌డ్
ఇబ్రహీంపట్నం అన్ రిజర్వ్‌డ్
అమన్‌గల్ అన్ రిజర్వ్‌డ్
కొత్తూర్ అన్ రిజర్వ్‌డ్
సదాశివపేట మహిళా జనరల్
నారాయణఖేడ్ అన్ రిజర్వ్‌డ్
అందొల్-జోగిపేట అన్ రిజర్వ్‌డ్
సంగారెడ్డి మహిళా జనరల్
ఇస్నాపూర్ మహిళా జనరల్
సూర్యాపేట అన్ రిజర్వ్‌డ్
తిరుమలగిరి అన్ రిజర్వ్‌డ్
కోదాడ మహిళా జనరల్
నేరేడుచర్ల అన్ రిజర్వ్‌డ్
కొడంగల్ అన్ రిజర్వ్‌డ్
వనపర్తి మహిళా జనరల్
అమరచింత అన్ రిజర్వ్‌డ్
పెబ్బేర్ అన్ రిజర్వ్‌డ్
వర్ధన్నపేట అన్ రిజర్వ్‌డ్
పోచంపల్లి అన్ రిజర్వ్‌డ్
యాదగిరిగుట్ట మహిళా జనరల్
భువనగిరి మహిళా జనరల్
చౌటుప్పల్ మహిళా జనరల్
బీసీ క్యాటగిరి...
ఇల్లెందు బీసీ మహిళా
జగిత్యాల బీసీ మహిళా
జనగామ బీసీ జనరల్
భూపాలపల్లి బీసీ జనరల్
ఐయిజ బీసీ జనరల్
వడ్డేపల్లి బీసీ జనరల్
అలంపూర్ బీసీ జనరల్
బిచ్కుంద బీసీ జనరల్
కామారెడ్డి బీసీ మహిళా
బాన్సువాడ బీసీ మహిళా
ఆసిఫాబాద్ బీసీ జనరల్
కాగజ్‌నగర్ బీసీ మహిళా
దేవరకద్ర బీసీ మహిళా
చెన్నూర్ బీసీ మహిళా
మెదక్ బీసీ మహిళా
ములుగు బీసీ మహిళా
కొల్లాపూర్ బీసీ మహిళా
అచ్చంపేట బీసీ మహిళా
నాగర్‌కర్నూల్ బీసీ జనరల్
దేవరకొండ బీసీ మహిళా
మద్దూర్ బీసీ జనరల్
పెద్దపల్లి బీసీ జనరల్
మంథని బీసీ జనరల్
వేములవాడ బీసీ జనరల్
షాద్‌నగర్ బీసీ జనరల్
జిన్నారం బీసీ జనరల్
జహీరాబాద్ బీసీ జనరల్
గుమ్మడిదల బీసీ జనరల్
సిద్దిపేట బీసీ జనరల్
గజ్వేల్ బీసీ మహిళా
దుబ్బాక బీసీ మహిళా
హుజూర్‌నగర్ బీసీ జనరల్
తాండూర్ బీసీ జనరల్
పరిగి బీసీ మహిళా
కొత్తకోట బీసీ మహిళా
ఆత్మకూర్ బీసీ మహిళా
నర్సంపేట బీసీ మహిళా
ఆలేరు బీసీ మహిళా
ఎస్టీ క్యాటగిరి...
కొల్లూరు ఎస్టీ జనరల్
భూత్పూర్ ఎస్టీ జనరల్
మహబూబాబాద్ ఎస్టీ జనరల్
కేసముద్రం ఎస్టీ మహిళా
ఎల్లంపేట ఎస్టీ మహిళా
ఎస్సీ క్యాటగిరి...
స్టేషన్ ఘనపూర్ ఎస్సీ జనరల్
చొప్పదండి ఎస్సీ మహిళా
జమ్మికుంట ఎస్సీ జనరల్
హుజూరాబాద్ ఎస్సీ మహిళా
ఎదులాపురం ఎస్సీ మహిళా
డోర్నకల్ ఎస్సీ జనరల్
లక్షెట్టిపేట ఎస్సీ జనరల్
మూడుచింతలపల్లి ఎస్సీ జనరల్
నందికొండ ఎస్సీ జనరల్
మొయినాబాద్ ఎస్సీ జనరల్
గడ్డపోతారం ఎస్సీ మహిళా
కోహిర్ ఎస్సీ జనరల్
ఇంద్రేశం ఎస్సీ మహిళా
చేర్యాల ఎస్సీ మహిళా
హుస్నాబాద్ ఎస్సీ జనరల్
వికారాబాద్ ఎస్సీ మహిళా
మోత్కూర్ ఎస్సీ మహిళా