అధైర్య పడొద్దు.. పార్టీ అండగా ఉంటుంది
పలు కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సామేలు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఆగస్టు 23: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.మండల పరిధిలోని కోడూరు గ్రామ సర్పంచ్ వల్లపు అవిలమ్మ భర్త వల్లపు సోమయ్య గుండెపోటు మృతిచెందగా ఆదివారం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ అవిలమ్మ,వారి కుటుంబ సభ్యులను ఓదార్చి అధైర్య పడుద్దని, పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
అదేవిధంగా మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ తో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ రహిమాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్,డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సామా అభిషేక్ రెడ్డి,డీసీసీ ప్రధాన కార్యదర్శి ఇందుర్తి వెంకట్ రెడ్డి,కార్యదర్శి వేల్పుల రమేష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ ఆవిలయ్య,మాజీ సర్పంచ్ పాలేలి సురేష్,ఏఎంసీ డైరెక్టర్ జలెంధర్,నాయకులు సామా రవీందర్,జ్యోతుల మల్లయ్య,కర్ణాకర్ రెడ్డి,జితేందర్ రెడ్డి,నల్లగుంట్ల నాగేందర్,శంకర్,ఉపేందర్,షేక్ షాబుద్దీన్,లతీఫ్,సయ్యద్,ఇక్బాల్,వెంకటాద్రి,రాము తదితరులు ఉన్నారు.






