ఎమ్మెల్యే సామేలు ఇంటి ముట్టడి
17-03-2026 02:29 AM
గుడ్లు, టమాటలతో దాడి చేసిన బీజీపీ, బీజేవైఎం నాయకులు
మేడిపల్లి, మార్చి 16 (విజయక్రాంతి): హిందువులను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని తుంగతుర్తి ఎమ్మెల్యే మం దుల సామేలు ఇంటిపై బీజేపీ, బీజేవైఎం దాడికి దిగారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మేడిపల్లిలోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి, కోడి గుడ్లు, టమాటాలతో ఇంటిపై దాడి చేశారు. మేడిపల్లి పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సంద ర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆలయాల వద్దకు వచ్చి గెలిపించాలని దండాలు పెట్టి, ఇప్పుడు హిం దువులను కించపరిచే విధంగా మాట్లాడటం సమంజసం కాదని, ఎమ్మెల్యే బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు.




