18 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం
17-03-2026 02:30 AM
సికింద్రాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో గృహ వినియోగానికి ఉద్దేశించిన ఎల్పీజీ సిలిండర్లను దుకాణాల్లో అక్రమంగా ఉపయోగిస్తున్న వారి పై అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 18 గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపా రు.
రేంజ్ మెంటల్ బజార్, తార్నాక, మెట్టుగూడ, వారాసిగూడ తదితర ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడులను సికింద్రాబాద్ అసిస్టెంట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ జి. వి. చాముండేశ్వరీ ఆధ్వర్యంలో డీటీలు ఉత్తేజ్ సాగర్, అభిషేక్, శ్రీనివాస్, అరుణతో పాటు ఇన్స్పెక్టర్లు పాల్గొని నిర్వహించారు. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.




