1 August, 2026 | 1:06 AM

దెబ్బతిన్నలో లెవెల్ బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్

01-08-2026 12:00 AM

కోరుట్ల రూరల్, జూలై 31 (విజయక్రాంతి): రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలోని లో లెవెల్ బ్రిడ్జిని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ శుక్రవారం పరిశీలించారు. బ్రిడ్జి పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి, వంతెనకు శాశ్వత పరిష్కారం కల్పించేలా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు.

అదే విధంగా వర్షాల కారణంగా మిషన్ భగీరథ ప్రధాన పైపులు విరిగిపోవడంతో సుమారు 20 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయిందని పేర్కొంటూ, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ఆయా గ్రామాలకు వీలైనంత త్వరగా తాగునీటిని పునరుద్ధరించాలని సంబంధిత ఉన్నతాధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పరాజ్పూర్ గ్రామ సర్పంచ్ నత్తి రాజ్కుమార్, కల్లూరు మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, ఉపసర్పంచ్ బండారి మహేష్, కల్లూర్, సర్పరాజ్పూర్ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.