1 August, 2026 | 1:07 AM

కొండగట్టు గిరిప్రదక్షిణ ఫలితమే సమృద్ధి వర్షాలు

01-08-2026 12:00 AM

బీఆర్‌ఎస్ హేళనకు చెంపపెట్టు 

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్ క్రైం, జూలై 31 (విజయక్రాంతి): కొండగట్టు గిరి ప్రదక్షిణ ఫలితంగానే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని,  గిరిప్రదక్షిణపై హేళన చేసిన బీఆర్ ఎస్ నాయకులకు ఇది చెంపపె ట్టు లాంటిదని చొప్పదండి ఎమ్మె ల్యే, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేడిపల్లి సత్యం అన్నారు. 

కరీంనగర్  జిల్లా వ్యాప్తంగా రెండు మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు  జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ఎరువుల పంపిణీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్ ను కలిసి కోరారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మీడియాతో  మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులందరూ సంతోషంగా ఉన్నారన్నారు.

ఎల్ ని నో ప్రభావంతో కరువు వస్తుందని ఆందోళన పడ్డ రైతులు ఇప్పుడు సంతోషంగా దుక్కి దున్నుకుంటూ నాట్లు వేస్తున్నారన్నారు. జరిగిన అన్ని ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఈ స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా దోచుకున్న వేల కోట్లతో బిఆర్‌ఎస్ నేతలు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ను అడ్డుపెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పురుమల్ల మనోహర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్, తదితరులు పాల్గొన్నారు.