బీఆర్ఎస్‌ను వీడటం నాకు బాధగానే ఉంది : ఎంఎల్ఎ సంజయ్
02-07-2024 01:30 PM
హైదరాబాద్ : కవిత ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చిన్నాని జగిత్యాల ఎంఎల్ఎ డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ ను వీడటం తనకు కూడా బాధగానే ఉందని, జగిత్యాల అభివృద్ధి రేవంత్ తోనే సాధ్యమని అందుకు పార్టీ మారినట్లు ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో కలిసి పని చేస్తానని ఎంఎల్ఎ సంజయ్ పేర్కొన్నారు. జగిత్యాల నుంచి రెండుసార్లు ఎంఎల్ఎగా గెలిచిన ఆయన బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి కాంగ్రెస్ జీవన్ రెడ్డిని రెండుసార్లు ఓడించారు. జూన్ 23వ తేదీన బీఆర్ఎస్ ను వీడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.






