18 July, 2026 | 3:07 AM

ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు

02-07-2024 02:24 PM

హైదరాబాద్ : ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.  మొత్తం 3035 ఉద్యోగాల భర్తీకి  అనుమతించింది. త్వరలో 2000 డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక్ ఉద్యోగాలు, 198 డీప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు, 25 డిపో మేనేజర్ ఉద్యోగాలు, 38 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు,  11 సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు, 14 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ అనుమతిపై హార్షం వ్యక్తం చేస్తూ.. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తామన్నారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్లను వెలువరిస్తామని ఆయన పేర్కొన్నారు.