ఘనంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
నాగోల్‌లో పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ
ఎల్బీనగర్, జూలై 27 : ఎల్బీనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని నాగోల్ డివిజన్ బీఆర్‌ఎస్ నాయకుడు పోచంపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజ సేవే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించి వారికి చీరలను, బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ..
ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుండే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అనంతుల రాజారెడ్డి, చెరుకు ప్రశాంత్ గౌడ్, తూర్పటి చిరంజీవి, సతీష్ యాదవ్, పల్లె సీతారాములు, కోలన్ చంద్రశేఖర్ అజాద్, శిల్పా రెడ్డి, అనంతుల శ్రీనివాస్ రెడ్డి, బద్దం నరేందర్ గౌడ్, చిత్రాల జగదీష్, రమేష్ రాజు, శంకర్, రాహుల్, భాస్కర్ రెడ్డి, ప్రదీప్ గౌడ్, వెంకటరమణ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.






