28 July, 2026 | 12:57 AM

అరుంధతినగర్ బస్తీ అధ్యక్షుడిగా తొమ్మిదోసారి మెరుగు శ్రీనివాస్ యాదవ్ ఎన్నిక

28-07-2026 12:00 AM

ముషీరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ పరిధిలోని అరుంధతి నగర్ బస్తీ అధ్యక్షుడిగా మెరుగు శ్రీనివాస్ యాదవ్ తొమ్మిదోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం. నరసయ్య ఆయనను అభినందించి సత్కరించారు.

అనంతరం నరసయ్య మాట్లాడుతూ 2003 నుంచి సుమారు 23 ఏళ్లుగా బస్తీ ప్రజలకు నిస్వార్థంగా సేవలందించడం వల్లే శ్రీనివాస్ యాదవ్కు ప్రజలు మరోసారి పట్టం కట్టారని అన్నారు. ఎన్నికైన మెరుగు శ్రీనివాస్ యాదవ్ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన బస్తీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పునిరెడ్డి జైపాల్ రెడ్డి, ఎం. లక్ష్మణ్, సురేష్, గుండెల్లి రవీందర్ యాదవ్, అజయ్ గౌడ్, మీసాల శేషగిరి, సీహెచ్ రాజు, మేకల దాసు, గడ్డం ప్రభాకర్, సత్యనారాయణ, సంపత్, కృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.