28 July, 2026 | 12:49 AM

హాస్టల్ విద్యార్థులకు ఫ్యాన్లు అందజేత

28-07-2026 12:00 AM

500+ మార్కులు తెచ్చిన విద్యార్థులకు రూ.10 వేలు: జీఎం అంజయ్య

నల్లగొండ టౌన్, జులై 27: హాస్టల్ విద్యార్థులు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని విద్యుత్ శాఖ జనరల్ మేనేజర్ అంజయ్య అన్నారు. 1989-1991లో విద్యనభ్యసించిన హాస్టల్ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, విద్యా పరిస్థితులు హాస్టల్లోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

హాస్టల్లో ఫ్యాన్ల లేకపోవడంతో దోమలతో ఇబ్బందులు పడుతున్నట్లు వార్డెన్ వీరబాబు చెప్పడంతో వెంటనే స్పందించిన అంజయ్య అవసరమైన ఫ్యాన్లను అందజేశారు.నేను ఇదే హాస్టల్లో చదివి నేడు ఈ స్థాయికి చేరుకున్నాను. మీరు కూడా కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగాలు సాధించి, మీ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి గుర్తింపుని స్తూ సమాజంలో గౌరవాన్ని పొందాలని ఆకాంక్షించారు.

10వ తరగతి పరీక్షల్లో 500 మార్కులకు పైగా సాధించే ప్రతి విద్యార్థికి రూ.10,000 చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతి అందజేస్తానని ఆయన ప్రకటించారు.హాస్టల్లోనే నివసిస్తూ ప్రతిరోజూ విద్యార్థులకు విద్యాబోధన చేయడంతో పాటు, వారి అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి సౌకర్యాలు కల్పిస్తున్న వార్డెన్ వీరబాబు సేవలను ప్రశంసించారు. హాస్టల్ భవనం స్లాబ్ శిథిలావస్థలో ఉండటంతో సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, హభవన మరమ్మతులు చేపట్టేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉస్మాన్ అలీ,తిప్పర్తి గ్రామ సర్పంచ్ బద్దం రజిత సుధీర్ గౌడ్ , ఇండ్లూరు గ్రామ సర్పంచ్ పాపకంటి సైదులు, హాస్టల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.