14 April, 2026 | 5:14 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే తోట

07-04-2025 08:14 PM

డోంగ్లీ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోమవారం నియోజకవర్గంలోని డోంగ్లీ మండలం సిర్పూర్ గ్రామంలో సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. సన్న బియ్యంతో వండిన భోజనం ఎలా ఉందని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాలు వస్తున్నాయా అంటూ ఆరా తీశారు. ప్రజాప్రభుత్వం పేదలందరికీ నాణ్యమైన సన్నబియ్యం ఇచ్చి వారి కడుపు నింపుతుందని ఎమ్మెల్యే అన్నారు. 

సంపన్నులు తినే సన్న బియ్యాన్ని సామాన్యులకు ఉచితంగా పంపిణీ చేయడంతో ఊరూరా సంబురాలు చేసుకుంటున్నారని చెప్పారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే వాటిని తినడానికి ఎవరూ ఆసక్తి చూపేవారు కాదని తెలిపారు. పథకం పక్క దారి పట్టి దళారులు, మిల్లర్లు లబ్ది పొందేవారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసమే పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.