1 July, 2026 | 12:57 AM

ప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు కావాలి

01-07-2026 12:00 AM

ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారం స్వీకరించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

నిజాంసాగర్ జూన్ 30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ  కార్యక్రమంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బీ ఎల్ ఒ చేతుల మీదుగా సర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అర్హులైన ప్రతి పౌరుడు తప్పనిసరిగా సర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి ఓటరు జాబితాలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, తహసీల్దార్, స్థానిక నాయకులు, ఎన్నికల సిబ్బంది, పాల్గొన్నారు.