1 July, 2026 | 12:54 AM

మొక్కలు నాటిన సహకార సంఘ అధ్యక్షుడు నర్సింహారెడ్డి

01-07-2026 12:00 AM

నిజాంసాగర్ జూన్ 30( వియ క్రాంతి) సహకార సంఘ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సహకార సంఘ పరిధిలో గల ఫంక్షన్ హాల్ వద్ద సహకార సంఘ అధ్యక్షులు కయ్యం నరసింహారెడ్డి మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణ భాగంగా మొక్కలు నాటినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ సీఈవో సంగమేశ్వర్ గౌడ్, డైరెక్టర్ విట్టల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.