తెలంగాణలో వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలి
ఎఐఎంఎంఓ, ఐఎల్ డబ్ల్యూఎఫ్ డిమాండ్
ముషీరాబాద్, జూన్ 30 (విజయక్రాం తి): తెలంగాణలో వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని, జామియా నిజామియా వక్ఫ్ ఆస్తులు, షేక్పేట్లోని దర్గా హుస్సేన్ షా వలి వక్ఫ్ భూములను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ము స్లిం మైనారిటీ ఆర్గనైజేషన్(ఎఐఎంఎంఓ), ఐఎల్డబ్ల్యూఎఫ్ వెల్ఫేర్ ఫెడరేషన్ డిమాండ్ చేశాయి. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఐఎంఎంఓ చైర్మన్ సయ్యద్ ముక్తార్ హు స్సేన్, మాజీ చైర్మన్ ఇనాయత్ అలీ బాఖరీ, ఉమ్మడి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎంఏ. సిద్ధిఖీ మాట్లాడారు.
జామియా నిజామియా ఆస్తుల వివరాలను ఉమీద్ పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. షేక్పేట్లోని దర్గా హుస్సేన్ షా వలి వక్ఫు్క చెందిన 1,654 ఎకరాల్లో ప్రస్తుతం 428 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆరోపిం చారు. ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వక్ఫ్ ఆస్తుల కేసులను వేగవంతం చేసి, వక్ఫ్ బోర్డుకు న్యాయాధికారాలను బలోపేతం చేయాలని, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్)ను పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.






