13-01-2026 05:21:43 PM
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
కంసాన్ పల్లి - గిరాయిగుట్ట బీటి రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే..
షాద్ నగర్,(విజయక్రాంతి): గ్రామాల్లో ఉండే నాయకులు అభివృద్ధిపై దృష్టి సారించాలని, పార్టీలు మనకు ముఖ్యం కాదు , మన గ్రామ అభివృద్ధి మనకు ముఖ్యం.. పార్టీలకతీతంగా నాయకులు అభివృద్ధికి బాటలు వేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొరారు. ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామం నుండి గిరాయి గుట్ట తండా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి దాదాపు 3.5 కోట్ల నిధులతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పార్టీలు, రాజకీయాలు ఎన్నికల సమయంలో మాత్రమే ఉండాలి.. మిగతా సమయంలో పార్టీలకు అతీతంగా అందరం కలిసి నదిచి గ్రామాలను, తండాలను అభివృద్ధి వైపు నడిపింఛాలని అన్నారు.
అభివృద్ధి పనుల విషయంలో అందరూ సహకరించాలని, కాంట్రాక్టర్ల ను ఇబ్బంది పెట్టకుండా వారికి సహకరిస్తే వేగంగా పనులు పూర్తవుతాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అదేవిధంగా షాద్ నగర్, కొత్తూరు మున్సిపాలిటీలను కూడా వార్డుల వారీగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గిరాయి గుట్ట తండా సర్పంచ్ కృష్ణవేణి హరినాయక్, మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చల్ల శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క బాలరాజ్ గౌడ్, లింగారెడ్డి గూడా గ్రామ ఉపసర్పంచ్ అశోక్ పాల్గొన్నారు .