calender_icon.png 13 January, 2026 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి కూలీల ఆదాయం రెట్టింపు

13-01-2026 06:03:12 PM

హైదరాబాద్: వీబీజీ రామ్‌ జీ(VBG RAM G Scheme) కోసం గతంలో కంటే అదనంగా రూ.17 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) వెల్లడించారు. వీబీజీ రామ్‌ జీ పథకం అమలులో కేంద్రం వాటా రూ.95,692 కోట్లు, రాష్ట్రాల వాటా రూ. 55,589 కోట్లు అన్నారు. తెలంగాణలో వీబీజీ రామ్ జీ అమలుకు అదనంగా రూ. 340 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేసేలా వీబీజీ రామ్‌ జీ చట్టం తీసుకొచ్చామని బండి సంజయ్ తెలిపారు. వ్యవసాయ సీజన్ లో వీబీజీ రామ్‌ జీ పథకం పనులు జరగవన్నారు.

వ్యవసాయ సీజన్ లో వీబీజీ రామ్‌ జీ పనులు జరగకపోవడం వల్ల కూలీలు అందుబాటులో ఉంటారని తెలిపారు. వీబీజీ రామ్ జీ వల్ల ఉపాధి కూలీల ఆదాయం రెట్టింపు అవుతోందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. వీబీజీ రామ్ జీ వల్ల 200 రోజుల ఉపాధి దొరుకుతోందని పేర్కొన్నారు. వీబీజీ రామ్ జీ పనుల విషయంలో కేంద్రం జోక్యం ఉండదని బండి సంజయ్ చెప్పారు. గ్రామసభల తీర్మానం మేరకు వీబీజీ రామ్ జీ పనులు జరుగుతాయన్నారు. వీబీజీ రామ్ జీ పథకంలో కాంగ్రెస్ కు ఏం తప్పుకొనిస్తుందో తెలియట్లేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.