calender_icon.png 13 January, 2026 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా రత్నం లక్ష్మీ

13-01-2026 05:14:12 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల నియామకాలు ఎట్టకేలకు కార్యరూపం దాల్చాయి. నామినేటెడ్ పదవి దక్కించుకొని కాసిపేట మండలం బోణీ కొట్టింది. బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అనూహ్యంగా కాసిపేట మండలం సొంతం చేసుకుంది. మార్కెట్ చైర్ పర్సన్ పదవీ అనూహ్యంగా  కాసిపేట మండలానికి చెందిన రత్నం లక్ష్మీ నీ వరించింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలినీ నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు నియామక ఉత్తర్వులను విడుదల చేసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రకటించింది. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ  చైర్ పర్సన్ గా రత్నం లక్ష్మీ, వైస్ చైర్మన్ గా సింగర్సు రవీందర్ రావు ను నియమించారు. కమిటీ  సభ్యులుగా 17 మందికి చోటు దక్కింది.  మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా నియమితులైన రత్నం లక్ష్మీ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కలసి కృతజ్ఞతలు చెప్పింది.  వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గo ప్రకటన భవిష్యత్ లో ప్రకటించనున్న నామినేటెడ్ ఆశవాహుల్లో ఆశలు రేకెత్తించాయి..