13-01-2026 05:16:41 PM
క్రైస్తవ మైనార్టీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంకు కృతజ్ఞతలు
ఎంసీపీఎఫ్ అధ్యక్షులు ఐతు డేవిడ్
మంథని,(విజయక్రాంతి): క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిల అలంకరణ (పెయింటింగ్ అండ్ లైటింగ్) కొరకు నిధులు కేటాయిస్తామని క్రైస్తవ మైనారిటీలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చి మాట నెరవేర్చింది. సోమవారం రాత్రి శివకిరణ్ గార్డెన్ లో నిర్వహించిన సమావేశం లో రూ. 30 వేల చెక్కును రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా అందుకున్న క్రైస్తవ మైనారిటీ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఎంసిపి ఎఫ్ కమిటీ గౌరవ అధ్యక్షులు ఐ. ఎలీషా, అధ్యక్షులు ఐ. డేవిడ్, ఉపాధ్యక్షులు ఎస్. జయరాజ్, కార్యదర్శి కన్నూర్ అశోక్, జాయింట్ కార్యదర్శి జోషి, కోశాధికారి ఆరుమల్ల దైవ కృపాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సిహెచ్. సుదర్శన్, కె.జోసెఫ్ మంథని నవీన్ కుమార్, జిల్లా సంక్షేమ మైనారిటీ సీనియర్ సహాయకులు ఆఫ్సన్ ఆభరర్, మంథని నియోజకవర్గ పాస్టర్లు మధుసూదన్, రవీందర్, జక్కయ్య, దూడపాక మహేష్ లు ఉన్నారు. రూ. 30 వేల చెక్కును అందజేసిన మంత్రి శ్రీధర్ బాబు కు క్రైస్తవ మైనారిటీ లు కృతజ్ఞతలు తెలిపారు.