calender_icon.png 13 January, 2026 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా ఓటర్లే అధికం

13-01-2026 05:06:30 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల(Telangana municipal elections) నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లతో 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మమిళా ఓటర్లే అధికంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో 25,62,369 పురుష ఓటర్లు, 26,80,014 మహిళా ఓటర్లు ఉన్నారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో 640 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉండగా, కొత్తగూడెం కార్పొరేషన్ లో అత్యల్పంగా 1,34,775 మంది ఓటర్లున్నారు. ఆదిలాబాద్ మున్సిపాల్టీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉండగా, అమరచింత మున్సిపాల్టీల్లో అత్యల్పంగా 9,147 మంది ఓటర్లున్నారు.