calender_icon.png 13 January, 2026 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రిని అడ్లూరిని కలిసిన తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ఉద్యోగులు

13-01-2026 05:12:26 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): తెలంగాణ  క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం షెడ్యూలు కులాల అభివృద్ధి ,గిరిజన సంక్షేమ దివ్యాంగుల, వయోవృద్ధుల సాధికారిక శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని తెలంగాణ సచివాలయంలో మంగళవారం నాడు తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలిసి సమస్యలను వివరించడం జరిగింది.

గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్న. తమకు న్యాయం జరగడం లేదని చాలీచాలని వేతనాలతో జీవితాలను కొనసాగిస్తున్నామని తెలపడం జరిగింది. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సి ఆర్ పి లకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఇట్టి విషయాన్ని మానవత దృక్పథంతో వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరడం జరిగింది .ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ వీరి సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులకు తెలపడం జరిగింది .ఈ కార్యక్రమంలో టిసిఆర్పిఏ అధ్యక్షులు తిరందాస్.సంతోష్ కుమార్ ,కార్యదర్శి కొత్త కాపు శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ముఖ్య సలహాదారులు బి.శ్రీధర్ కుమార్, కె.భాస్కర్,డి. శరత్ కుమార్, యువరాజు తదితరులు పాల్గొన్నారు.