calender_icon.png 13 January, 2026 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియామక పత్రాలు అందుకున్న నూతన ల్యాబ్ టెక్నీషియన్లు

13-01-2026 03:55:42 PM

మద్నూర్, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ల్యాబ్ టెక్నీషియన్లు ప్రజలకు 2017 నుండి సేవ చేస్తూ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పెట్టిన1284 పరీక్షలు183 మెరిట్ లో క్వాలిఫై ల్యాబ్ టెక్నీషియన్స్ మంగళవారం దామోదర రాజనర్సింహ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి  చేతుల మీదగా నియామక పత్రాలు అందుకున్నారు.మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామానికి చెందిన డి.నరేష్ కుమార్  జుక్కల్ పీహెచ్ సి టెక్నీషియన్ గ్రేడ్ 2 గా రెగ్యులర్ పే స్కేల్ గా. బిచ్కుంద పట్టణానికి చెందిన కొనింటి తుకారాం కామారెడ్డి మెడికల్ కాలేజీ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 గా, లచ్చన్ గ్రామానికి చెందిన అమృత్వార్ ప్రవీణ్ కుమార్.కామారెడ్డి మెడికల్ కాలేజీకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 గా రెగ్యులర్ గా నియామక పత్రాలు అందుకున్నారు.ప్రజలకు మరింత సేవ చేసి మన్ననలు పొందాలని వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు  మిత్రులు వారిని అభినందించారు.