calender_icon.png 14 January, 2026 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకం

14-01-2026 01:35:05 PM

మఠంపల్లి: ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమైందని మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా,కాల్వపల్లి తండా,పాత దొనబండతండా,లాలి తండా సర్పంచ్లు బానోతు అరుణా దేశ్ పాండు నాయక్,మాలోతు సక్రు నాయక్, బాలు నాయక్,ఘమా మందనాయక్ అన్నారు.బుధవారం  వారు విజయక్రాంతి దినపత్రిక నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ను రిపోర్టర్ బానోతు పాండు నాయక్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి పత్రికలు వారధిగా ఉండాలని కోరారు.అనేక సీనియర్ పాత్రికేయుల మన్ననలు పొంది ప్రజల ఆదరణ పొందుతుందని,ఈ పత్రికలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలకు తెలియజేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నితిన్ నాయక్, కార్యదర్శి బాలాజీ నాయక్,దేవాలయం చైర్మన్ నాగరాజు,వార్డు సభ్యులు రమేష్, చంటి, హనూమ,బాలు నాయక్, హబి,నాగేశ్వరరావు,నాగు,చందులాల్ తదితరులు పాల్గొన్నారు.