01-11-2025 04:55:35 PM
ఆమనగల్లు: ఇటీవల మాజీ మంత్రి, బిఆర్ఎస్ అగ్ర నాయకులు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్ లో ఆయన నివాసంకు చేరుకొని సత్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం హరీష్ రావును కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వరరావు, సురేందర్ రెడ్డిలు పరామర్శించిన వారిలో ఉన్నారు.