calender_icon.png 8 December, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకం ఏదైనా.. పైసా వసూల్!

08-12-2025 12:00:00 AM

-సంఘాల పేరుతో నిర్మల్ జిల్లాలో వసూల్ రాజాలు..?

-దివ్యాంగుల అవసరాలను.. ఆసరా చేసుకుంటున్నా వైనం

-లీడర్ల నమ్మి డబ్బులు ఇస్తున్న బాధితులు

-ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా అడిషనల్ కలెక్టర్

నిర్మల్, డిసెంబర్ ౭ (విజయక్రాంతి): వాళ్లంతా అంగవైకల్యంతో ఉన్నవారు. ఆసరా కోసం దివ్యాంగుల సంఘం నాయకులను సంప్రదిస్తే సాయం చేయాల్సిన నేతలే చేతివా టం ప్రదర్శిస్తూ అందినంత దోపిడీ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి.

దివ్యాంగుల హక్కుల కోసం సంఘాన్ని ఏర్పాటు కొందరు లీడర్లు సంఘం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అమాయక దివ్యాంగులను బురి డీ కొట్టించి ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో మోసం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తు న్నారు. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైంసా , ఖానాపూర్ మున్సిపాలిటీలతోపాటు 18 మం డలాల్లో సుమారు  18,856 మంది దివ్యాంగులు ఉండగా అందులో  10,548 దివ్యాం గులు ప్రభుత్వం పెన్షన్ వస్తుంది. 

దివ్యాంగు ల సంక్షేమం వారి హక్కుల సాధనకు జిల్లాలో దివ్యాంగుల సంక్షేమ సంఘాలను కొందరు నేతలు ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. జిల్లాలో మొత్తం 11 సంఘాలు ఉండగా ఏడు సంఘాలు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు దివ్యాంగుల సంక్షే మం కోసం పాటుపడుతున్నామంటూ గొప్ప లు చెప్పుకొని సంక్షేమం పేరుతో అక్రమవస్తులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తు న్నాయి.

ప్రతినెల సమావేశాలు నిర్వహించుకుంటూ ప్రెస్ నోట్లను రిలీజ్ చేస్తూ తమ సం ఘం దివ్యాంగుల కోసం కృషి చేస్తుందని ఆర్భాటాలు బాటలు చెప్పిన నాయకులు అమాయక దివ్యాంగుల అవసరాలను ఆసరా గా చేసుకుని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను తాము చెప్పిన వారికే పథకాలు వర్తి స్తాయని నమ్మబలికి వారి వద్ద నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. 

ఈనెల 3న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో మంజులాపూర్‌కు చెందిన పోశవ్వ దివ్యాంగుల సంఘంలో పనిచేస్తున్న శివ అనే వ్యక్తిని పింఛన్ కోసం 7000 వసూ లు చేయగా పెన్షన్ రాకపోవడంతో కాలర్ పట్టి నిలదీసిం ది. లోకేశ్వరం మండలం ధర్మవరం చెందిన ఓ కుటుంబం ట్రై సైకిల్ కోసం పది వేలు లంచం అడిగినట్టు ఆరోపించింది. సారంగాపూర్ మండలంలోని పారమూరుకు చెందిన దంపతులకు పెన్షన్ కోసం ఓ వ్యక్తికి రూ.5000 ఇవ్వగా రెండేళ్ల నుంచి పెన్షన్ మంజూరు కాలేదు.

పనిని బట్టి డబ్బులు వసూలు ?

నిర్మల్ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి ఏర్పడ్డ సంఘాలు కొందరు నేతలు సంఘం పేరుతో అమాయక దివ్యాంగులను సంక్షేమ పథకాల పేరుతో అక్రమ వాసులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు ప్రతినెల 3,016 పెన్షన్ ఇవ్వడం దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలైన రేషన్ కార్డులు ఇండ్ల స్థలా లు ఇండ్లు డబుల్ బెడ్ రూములు స్వయం ఉపాధి పథకాలు వినికిడి యంత్రాలు రైస్ సైకి ల్లు చదువుకునే వారికి నగదు ప్రోత్సాహం దివ్యాంగులైన పెళ్లి చేసుకునే వారికి రెండు లక్ష ల ఆర్థిక సాయం. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ తదిత ర పథకాలను అమలు చేస్తుంది.

దివ్యాంగుల చట్టం ప్రకారం ప్రతి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తోంది. దివ్యాంగుల సదర సర్టిఫికెట్ కో సం దివ్యాంగులైన వారు ఆధార్ కార్డుతో మీ సేవ కేంద్రంలో స్లాట్ బుకింగ్ చేసుకొని ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపుకు హాజరైతే వైద్యుల పరీక్ష అనంతరం అంగవైకల్యం సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఇది ఎవరు పోయిన సాధారణంగా జరిగే కార్యక్రమం. 

అయితే కొందరు సంఘ నాయకులు తాము చెప్తేనే స్లాట్ బుకింగ్ అయితదని డాక్ట ర్ సర్టిఫికెట్ ఇస్తారని పెన్షన్ కూడా ఆన్లైన్లో తాము చెప్పిన పేర్లే ఎంట్రీ అవుతాయని నమ్మబలికి పది వేల నుంచి 15 వేల వరకు వసూలు చేస్తున్నారు.

అదేవిధంగా రేషన్ కార్డులు ఇందిరమ్మ స్థలాలు ఉచిత డబ్బులు బెడ్ రూమ్ ప్రభుత్వ దివ్యాంగుల లోన్లు వెనికిడి పరికరా లు రైస్ సైకిల్లు ప్రభుత్వం దివ్యాంగులకు ఏ పథకం అమలు చేయాలని తమ సంఘం సిఫార్సు చేసిన వ్యక్తులకే మంజూరవుతాయని అమాయక దివ్యాంగులను నమ్మించి వారి వద్ద ఆ పనిని బట్టి ఐదు వేల నుంచి 20 వేల వరకు వసూలు చేస్తున్నారు. దివ్యాంగులు కార్యాలను చుట్టూ తిరిగి పరిస్థితి లేకపోవడం తో సంఘాల నేతలకు పనులను అప్పగిస్తున్నారు.

కొందరు లీడర్లు అయితే సదరన్ క్యాంపుల్లో వైద్యులు అక్కడ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి తప్పుడు దృవీకరణ పత్రాలు జారీ చేయించి వారి వద్ద నుంచి రూ.30 వేల నుంచి 40,000 వరకు వసూలు చేస్తున్నారని విమర్శలు వినవస్తున్నాయి. అయితే దివ్యాంగులు ప్రభుత్వ నిబంధనల అర్హతలు ఉన్నవా రికి ఎవరి ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలు అందుతుండగా వాటిని తామే మం జూరు చేయించామని చెబుతూ మిగతా వారి ని బుట్టలు వేసుకుంటున్నారు.

ఒక సంఘం వారితో పని జరగకపోతే మరో సంఘాన్ని ఆశ్రయిస్తున్నారు అక్కడ కూడా ఇదే పరిస్థితి తలుచుతోంది. ఓ మహిళ ప్రభుత్వ పెన్షన్ కో సం దివ్యాంగుల సర్టిఫికెట్ తీసుకున్నందుకు మూడు సంఘాల ముఖ్య నాయకులకు సుమారు రూ.18000 డబ్బులు ఇచ్చిన ఇంతవరకు పని జరగలేదని సమావేశంలోనే ఆవేద న వ్యక్తం చేసింది.

ఇదంతా నిర్మల్ జిల్లాలో బహిరంగ గా జరుగుతున్న తతంగం అయినప్పటికీ దివ్యాంగుల వైద్యుల సంక్షేమ శాఖ పట్టించుకోకపోగా, సంఘ నేతలను సమావేశాల్లో కుర్చీలో కూర్చోబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రతినెలా సమావేశాలు అంటూ సభ్యత్వం పేరుతో కొన్ని సంఘాలు రూ.100 వసూలు చేసి ఆ పైసలను సొంతగా వాడుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

జిల్లా అధికారులు దృష్టి పెట్టాలి..

నిర్మల్ జిల్లాలో కొన్ని దివ్యాంగుల సంక్షేమ సంఘాల నేతలు అక్రమ వాసులపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దివ్యాంగుల సంక్షేమానికి నిర్మల్ జిల్లా లో జిల్లా వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ పనిచేస్తుంది.

ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే దివ్యాంగులకు ప్రభుత్వ పథకాల అమ ల్లో చైతన్యం కల్పించాలి. సదరం స్లాట్ బుకింగ్ వైద్య పరీక్షల విభాగంలో పారదర్శకత పాటించాలి. సంఘ నేతలు సిఫార్సు చేస్తే వాస్తవాలను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారికి ఆ పథకం వర్తించే విధంగా చూడాలి.

అక్రమల వసూళ్లకు పాల్పడుతున్న నేతలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ జరిపి ఆధారాలు లభిస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటే మిగతా వారికి భయం ఉంటుంది. సంఘాల నేతల సిఫారసు ఆధారంగా ఇప్పటికే నిర్మల్ జిల్లాలో 10,548 పెన్షన్లలో 2000పైగా సదరం సర్టిఫికెట్లు అర్హత లేకున్నా జారీ చేసినట్టు సంఘ నేతలే పేర్కొంటున్నారు. వీటిపై విచారణ జరిపి తొలగించాలి.

కొత్త పెన్షన్‌కు రూ.20 వేలు ఖర్చు చేశా..

నాది నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్. మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికురాలిగా పనిచేస్తున్న. నేను దివ్యాంగురాలిని కష్టపడి పని చేస్తున్న పని చేసే వేతనం వస్తుంది. దివ్యాంగుల సదరం సర్టిఫికెట్ కోసం మూడు సంఘా ల లీడర్లకు ఇప్పటివరకు వేరువేరుగా 20 వర కు లంచం ఇచ్చిన.. ఇప్పటికీ పని కాలేదు. పైసలు ఇస్తలేరు.. పనిచేస్తలేరు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి.

 పోచవ్వ, మంజులాపూర్

డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి

నిర్మల్ జిల్లా లో దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అరులైన దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమ లు చేస్తున్నాం. సదరం స్లాట్ బుకింగ్ సదరం వైద్య శిబిరాలు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

సిబ్బంది అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం.దివ్యాంగ సంఘ నాయకులు తోటి దివ్యాంగ బాధితుల నుంచి ప్రభుత్వ పథకాల పేరుతో అక్రమాలకు పాల్పడితే ఆ సంఘాన్ని రద్దు చేయ డం కాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పథకాల కోసం ఎవరిని నమ్మి మోసపోవద్దు.

 ఫైజాన్ అహ్మద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నిర్మల్