5 July, 2026 | 3:54 AM

రేణుకా ఎల్లమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

12-06-2024 12:25 AM

నర్సాపూర్, జూన్ 11: నర్సాపూర్ పట్టణ సమీపంలోని శ్రీరేణుకా ఎల్ల మ్మ ఆలయ 13వ వార్షికోత్సవం మం గళవారం ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హాజరై రేణుకా ఎల్లమ్మదేవిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం గౌడ సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిం చడం అభినందనీయమని అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉం డాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నయీమోద్దీన్, బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు పంబళ్ల బిక్షపతి, గౌడ సంఘం నాయకులు అంతారం వెంకటేశ్ గౌడ్, సత్యం గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు.