25-05-2025 01:35:07 PM
బూత్ కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమంను వీక్షించిన ఎంపీ డీకే అరుణ
మహబూబ్‌నగర్, (విజయక్రాంతి): దేశంపై సేవ దృక్పథం ఎల్లప్పుడూ ఉంటూనే అభివృద్ధి పట్ల సంకల్పంతో ముందుకు సాగాలంటూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా చెప్పడం అందరూ ఎంతో శ్రద్ధగా విన్నారని ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) అన్నారు. ఆదివారం ఎనుగొండలో బూత్ కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్(Mann Ki Baat) కార్యక్రమంను ఎంపీ వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రతి మాట కార్యకర్తల మనస్సులన నిండి పోయిందని, దేశం పట్ల సేవా దృక్పథం, అభివృద్ధి పట్ల ఉన్న సంకల్పాన్ని ఆయన పంచిన విధానం ప్రతి ఒక్కరినీ ప్రేరేపించిందన్నారు.
ఈ సందేశం కార్యకర్తలలో కొత్త ఉత్సాహం నింపిందని స్పష్టం చేశారు. భారతదేశం వ్యాప్తంగా ఆయన నాయకత్వం ప్రజలలో నూతన ఆశావహతను కలిగిస్తుందని, సేవా, సంఘటన, సంకల్పం అనే మూడు సూత్రాలతో మేము ముందుకు సాగుతున్నామన్నారు. ప్రధాని మోదీ(Narendra Modi) మాటలు మాకు దిశానిర్దేశం కల్పించాయన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు, నారాయణపేటలో ఉపాధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, అన్ని మండలాల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు ఉన్నారు