14 August, 2026 | 5:21 AM

నీట్ అక్రమాలపై ఎన్టీయేను మందలించిన సుప్రీంకోర్టు

18-06-2024 02:10 PM

న్యూఢిల్లీ : నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ ఆరోపణలపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై తీవ్ర స్థాయిలో మండిపడింది. నీట్ అక్రమాలపై స్పందించాలని, రెండు వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్డీయేకి తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎవరైనా 0.001 శాతం నిర్లక్ష్యంగా వ్యవహరించిన దాన్ని పూర్తిగా పరిష్కరించాలని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది.