27-11-2025 12:05:35 AM
జుక్కల్, బాన్సువాడ నియోజక వర్గాల్లో మొదటి రోజు పర్యటన బాధితుల నుంచి స్వీకరించనున్న విజ్ఞప్తులు
కామారెడ్డి, నవంబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో శుక్రవారం ఎమ్మెల్సీ కవిత మొట్టమొదటిసారిగా పర్యట న ఈసందర్భంగా ఆమె జ జాగృతి కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 27, 28 రెండు రోజులపాటు కవిత కామారెడ్డి లోని పలు మండలాల్లో పర్యటిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా జాగృతి చైర్మన్ ఏ సంపత్ గౌడ్ తెలిపారు. 27న ఉదయం 10:30 గంటలకు నిజాం సార్ మండలంలోని నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు నదిపై సందర్శించనున్నారు.
అనంతరం 11 గంటలకు నిజాం సార్ ప్రాజెక్టు సందర్శన మధ్యాహ్నం 12:30 గంటలకు బాన్సువాడలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల సందర్శన మధ్యాహ్నం ఒంటిగంటకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్ మండలంలో ముంపు రైతులతో సమావేశం అనంతరం సాయంత్రం మూడు గంటల 30 నిమిషాలకు లింగంపేటలో గాంధీజీ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు సాయంత్రం నాలుగు గంటలకు చారిత్రక నాగన్న భావి సందర్శన, ఆరు గంటలకు తాడ్వాయి మండలంలోని తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి ఘన నివాళులు సాయంత్రం ఏడు గంటలకు రైలు ఢీకొని 90 గొర్రెలు చనిపోయిన సంఘటనలు మరణించిన కాపరి సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
అనంతరం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బసచేస్తారు. వరుసటి ఉదయం 28వ తేదీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించినట్లు వారు తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలిరావాలని అంతే కాకుండా జాగృతి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాగృతి కన్వీనర్ చైర్మన్ సంపత్ గౌడ్ తోపాటు ఆయా మండలాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం తదితరులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.