calender_icon.png 27 November, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధానికి ఆహ్వానం

27-11-2025 12:05:45 AM

  1. ఏర్పాట్లు చేయాలి 
  2. అధికారులకు సీఎం ఆదేశం   

హైదరాబాద్, నవంబర్ 26  (విజయక్రాంతి) :  తెలంగాణ రైజింగ్ -2025 గ్లోబల్ సమ్మిట్-  ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను ఆహ్వానించనున్నట్లు  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులను సమ్మిట్ కు ఆహ్వానించేందుకు ముందుగానే జాబితాను సిద్ధం చేయాలని, ఆహ్వానితులకు అనుగుణంగా ఎక్కడా లోటు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం  సూచించారు.

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, నిర్వహణపై  ముఖ్యంత్రి  బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఇతర అధికా రులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సమ్మిట్ లో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకునే విషయం లో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు.

స్టాల్స్ ఏర్పాటు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని, టైమ్ నిడివి ముందుగానే నిర్ణయించాలన్నా రు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా డ్రోన్‌షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన అన్ని డిజైన్లను పూర్తి చేయాలన్నారు.