4 June, 2026 | 1:34 AM

ఐరన్ మ్యాన్ పల్పునూరి తులసిరెడ్డిని సన్మానించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

04-06-2026 12:55 AM

కుత్బుల్లాపూర్, జూన్ 3 (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శంభీపూర్ లోని కార్యాలయంలో బౌరంపేట్ నివాసులు పల్పునూరి తులసిరెడ్డి ఇటీవల ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన సందర్భంగా మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సముద్ర మట్టానికి 8,848.86 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తున, అత్యంత క్లిష్టమైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్, ఆక్సిజన్ కొరత, తీవ్ర చలి, మంచు తుఫాన్లు, ప్రమాదకరమైన మార్గాల మధ్య ఈ శిఖరాన్ని అధిరోహించడం అసాధారణ ధైర్యసాహసాలకు నిదర్శనమని అలాంటి అరుదైన ఘనతను సాధించి భౌరంపేట్ గ్రామం పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటిన ఐరన్ మ్యాన్ పల్పునూరి తులసిరెడ్డిని అభినందించారు.

అచంచల పట్టుదల, క్రమశిక్షణ, కఠోర సాధన యువతకు ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ మిద్దాల బాల్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పల్పునూరి విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి, భుజంగం రెడ్డి, మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.