శంకుస్థాపన చేసిన స్థలంలోనే మెడికల్ కాలేజీ ఆసుపత్రిని నిర్మించాలి
మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి డిమాండ్
కందుకూరు, జూన్ 3 (విజయక్రాంతి): శంకుస్థాపన చేసిన స్థలంలోనే మెడికల్ కాలేజీ ఆసుపత్రిని నిర్మించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కందుకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం బేగరికంచ గ్రామంలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజీ మరియు 400 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నెలకొల్పడానికి గత ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రిని ఈప్రాంతంలో రద్దు చేసి ఎల్బీనగర్ కి తరలించి ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు.
ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని మెడికల్ కాలేజీతో పాటు 400 పడకల ఆసుపత్రి మంజూరు చేయించామని కానీ నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రద్దు చేయడం భావ్యం కాదని,తిరిగి అట్టి శంకుస్థాపన చేసిన స్థలంలోనే మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్,పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మినర్సింహ రెడ్డి, సురసాని సురేందర్ రెడ్డి,కాకి దశరథ,లేమూర్ సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లు సురసాని రాజశేఖర్ రెడ్డి, సురేష్, నాయకులు కాసుల రామకృష్ణ రెడ్డి, పొట్టి ఆనంద్, సామ ప్రకాష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, తాళ్ల కార్తీక్, ఇందిరా దేవేందర్, ఇందిరమ్మ, శ్రీహరి, దీక్షిత్ రెడ్డి, బర్కం వెంకటేష్, దేవీలాల్ నాయక్, బాబు, సదానంద్ గౌడ్, రామకృష్ణ, రవీందర్, దర్శన్ రెడ్డి, రాములు, శ్రీనివాస్, పాండు, శ్రీకాంత్, మోహన్ రెడ్డి, అఖిల్ కుమార్ పాల్గొన్నారు.






