4 June, 2026 | 1:38 AM

పరేడ్ గ్రౌండ్ వద్ద అమరవీరుల కుటుంబాల ధర్నా

04-06-2026 12:54 AM

సికింద్రాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు పరేడ్ గ్రౌండ్ వద్ద ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల స్తూపాలను ట్యాంకుబండ్ పై ఏర్పాటు చేయాలని మహబూబ్నగర్, సిద్దిపేట్, దమ్మాయిగూడ, జియాగూడ నుంచి వచ్చిన అమరవీరుల కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలించారు.