20 May, 2026 | 2:49 AM

సహాయం కోరిన వెంటనే స్పందన

20-05-2026 01:41 AM

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

జనగామ/భువనగిరి, మే 19 (విజయక్రాంతి): అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఆసరాగా నిలుస్తోందని టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.

మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జనగామ జిల్లా కేంద్రానికి చెందిన చామకూర చంద్రయ్యకు రూ.24వేలు, యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపురానికి చెందిన లింగం కృష్ణకు రూ.48 వేల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా ప్రత్యేక చొరవ తీసుకుని, త్వరగా చెక్కులు మంజూరు చేయించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.