ఇంకుడుగుంతలపై ముగిసిన శిక్షణ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): జలమండలిలో ఇంకుడు గుంతల నిర్మాణంపై గురువారంతో శిక్షణ కార్యక్రమం ముగిసిం ది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాతా వరణశాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ హాజరై శిక్షణపొందిన వారి కి ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ భూ గర్భ జలాలు అడుగంటిన నేపథ్యం లో వాటిని రీచార్జ్ చేయడానికి జలమండలి పలు చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ట్యాం కర్లు ఎక్కువగా బుక్ చేసుకున్న 30వేల మంది ప్రాంగణాల్లో ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టేలా అవగాహన కల్పించామన్నా రు. ఇందుకోసం 18ఎన్జీవో సంస్థలకు చెందిన ప్రతినిధులు పని చేస్తున్నారన్నారు.
ఇప్పటికే వారు 700 మందిని కలిసి ఇంకుడు గుంతల ప్రాముఖ్యం, నిర్మాణ పద్ధతిని సైతం వివరించినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాల్ని పెంచేందుకు జలమండలి, ఈపీటీఆర్‌ఐ, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణంపై 150 మంది ప్లంబర్స్, మేస్త్రీలకు ఈనెల 22 నుంచి మూడు రోజుల పాటు (22,24,25) శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, ఇంకుడు గుంతల ప్రత్యేకాధికారి జాల సత్యనారాయణ పాల్గొన్నారు.






