13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ప్రయాణికుల అవసరాల మేరకు ఎంఎంటీఎస్ సేవలు

27-03-2026 02:14 AM

స్వీయ ఆదాయ వనరులు పెంచుకోవాలి

ఎంఎంటీఎస్ స్టేషన్ల వరకు మినీ బస్సులు 

సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం 

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీ ఎస్ సర్వీసులు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎంఎంటీఎస్ ఏటికేడు ప్రయాణికుల తగ్గుముఖంపై ముఖ్యమం త్రి ఆరా తీశారు. గురువారం ఎంఎంటీఎస్ సర్వీసులపై శానసమండలి హాల్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కార్యాలయాల సమయాల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచడంతోపాటు క్రమం తప్పకుండా సమయపాలన పాటిస్తూ సర్వీసులు నడపాలని ఆదేశించారు.

ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, స్టేషన్లు లోపలికి ఉన్నందున అక్కడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు. మెరుగైన వసతులు ఉన్నప్పుడే ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతారని పేర్కొన్నారు. స్వీయ ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రయత్నించాలని అధికారులకు సూచించారు.

లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపుతోపాటు ప్రయాణికుల సంఖ్య పెంపు, వసతుల మెరుగుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ కే రామకృష్ణారావు, ఎంఏయూడీ స్పెషల్ సెక్రటరీ జయేష్‌రంజన్,  ఆర్‌అండ్‌బీ వికాస్‌రాజ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్‌యూఎంటీఏ ఎండీ జీవన్‌బాబు, దక్షిణ మధ్య రైల్వే డీసీఎం చరణ్‌నా యక్ పాల్గొన్నారు.