13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

డిగ్రీ కళాశాలలో మాక్ అసెంబ్లీ

31-03-2026 12:15 AM

చేవెళ్ల, మార్చి 30 (విజయక్రాంతి): చేవెళ్ళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  విద్యార్థులకు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగిందని వారు ప్రకటనలో పేర్కొన్నారు. పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో కవిత నిర్వహించగా సమన్వయంతో బి.ఏ. విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ విధానాన్ని ప్రతిబింబించేలా జరిగింది. విద్యార్థులు అధికార పార్టీగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలుగా బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం వంటి పార్టీల పాత్రలను పోషిస్తూ ప్రశ్నోత్తరాలు, చర్చలు, వాదనలు వినిపించారు.

సభ నిర్వహణలో విద్యార్థులు చూపిన చాతుర్యం  ప్రశంసనీయంగా నిలిచింది. ప్రజాస్వామ్య వ్యవస్థ, శాసనసభ విధులు, రాజకీయ అవగాహనపై పొందడం వక్తృత్వ నైపుణ్యాలు ఆత్మవిశ్వాసం చేకూరుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.సి. కాంచనలత విద్యార్థులను అభినందించారు. ఈ పొగ్రాం సమాజంలో బాధ్యత గల పౌరులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ మాక్ అసెంబ్లీ విద్యార్థులకు అనుభవంతోపాటు విద్య  ప్రాముఖ్యతను ప్రతిబింబించిందన్నారు.