ప్రజావాణికి 45 ఫిర్యాదులు
---కలెక్టర్ ప్రతీక్ జైన్
నారాయణపేట. మార్చి,30 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమానికి ప్రా ధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. కలెక్టర్ సోమవారం ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ అర్జీలను కలెక్టర్ కు సమర్పించగా, ప్రజల ఫిర్యాదులను సమస్యలను సావధానంగా విన్న కలెక్టర్ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు.
అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సోమవారం నాటి ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 45 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్ర రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను,వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.




