29 April, 2026 | 3:20 AM

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయండి

29-04-2026 01:17 AM
  1. ఫీజుల సమస్యలపై హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేయాలి
  2. విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయరాదు
  3. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ఫీజు బకాయిలు 10వేల కోట్లు బడ్జె ట్ విడుదల చేయాలని ఫీజులను విద్యార్థుల వద్ద వసూలు చేయాలని జాతీయ బీసీ సం క్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణ య్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వెంటనే హైకోర్టు ఫుల్ బెంచ్ కు అప్పీల్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తో మోడీ రాందేవ్, రాజేందర్, అనంతయ్య, బలరాం, అఖిల్ ముదిరాజ్, సాయి కిరణ్, జనార్ధన్ తదితరులు కలిసి చర్చలు జరిపారు.

అనంతరం వినతి పత్రాన్ని అంద జేశారు. అలాగే విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయరాదని ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ సంద ర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జ్ ఒక తీర్పులో విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేసుకోవాలని తీర్పు చెప్పింది. ఆ తరువాత అటు ప్రభుత్వం తర్వాత వాపస్ ఇవ్వాలని తీర్పు చెప్పిందని,  కోర్టు తీర్పు ప్రకారం చాలా కాలేజీలు విద్యార్థులను పీజులు కట్టాలని ఒత్తిడి చేస్తూ ఫీజు లు వసూలు చేస్తున్నారన్నారు. కోర్టు తీర్పు ప్రభావం వలన శ్రీ ఇందు కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వలన ప్రణిత అనే బిటిక్ 3వ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారన్నారు.

అడ్మిషన్ల సమయంలో కాలేజీలతో చదువుతున్నప్పుడు కాని లేదా కోర్సు పూర్తయిన తర్వాత టీసి తీసుకునే సమయంలో  విద్యార్థుల వద్ద పీజులు వసూలు చేయరాదని ప్రభుత్వం జీవో 18,  50 అలాగే ఇతర అనేక జీవోలతో పేర్కొన్నారన్న కేంద్ర ప్రభు త్వం ఉత్తర్వులు ఉన్నాయన్నారు. అఖిల భారత సాంకేతిక విజ్ఞాన సంస్థ, అలాగే యూజీసీ ఆదేశాలు,  సుప్రీంకోర్టు- హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, పీజులు కట్టే స్తోమత లేని వారి కోసం పేదవారు చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీము పెట్టడం జరిగిందన్నారు.

ఈ ఫీజు బకాయిలు చెల్లించకపో వడంతో విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నారన్నారు. ఈ ఫీజులు కట్టాలని కాలేజీ విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారని, కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. పరీక్షా సమయంలో హాల్ టికెట్లు ఇవ్వడం లేదని, సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు వచ్చినవారికి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.