04-07-2025 10:08:23 PM
సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ
పెన్ పహాడ్ : పెట్టుబడి దారి వ్యవస్థ అభివృద్ధి కోసం కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని అందులో భాగంగానే కేంద్రంలో అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ కోరారు. శుక్రవారం భక్తాలపురం, ధర్మాపురం, మహ్మదాపురం గ్రామాలలో జరిగిన ప్రజా సంఘాల గ్రామ సదస్సు కు ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. మోడీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో దేశాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అనుకూల చట్టాలను తీసుకువచ్చి కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే 4 లేబర్ కోడ్ లు తెచ్చారన్నారు. కార్మిక చట్టాలను రక్షించుకోవడం కోసం ఈనెల 9న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గుంజా వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ నెమ్మాది లక్ష్మి, ప్రజాసంఘాల నాయకులు ఇరుగు రమేష్, నెమ్మది పీరయ్య, నాగేల్లి రజిత, గౌని వెంకన్న, గంధం రాములమ్మ, గుండు వినోద, వీరస్వామి, సుమలత, బొల్లి కొండ లక్ష్మయ్య, గురవయ్య, అడిమయ్య, సోమన్న, గంధం నాగయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.