calender_icon.png 5 July, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా పాఠశాలకు కనీస వసతులు కల్పించాలి

04-07-2025 10:06:00 PM

దోసపహాడు విద్యార్ధులు ఎంపీడీవోకు మొర

పెన్ పహాడ్: మా పాఠశాలలో కనీస వసతులైన మరుగుదొడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని వెంటనే మా పాఠశాలకు కావాల్సిన కనీస వసతులు కల్పించి ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం ఎంపీడీవో వెంకటేశ్వరరావుకు మండలంలోని దోసపహాడ్ విద్యార్థులు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాల ఉపాధ్యాయుడు మామిడి వెంకటయ్యతో కలిసి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారికి కలసి పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలపై ఎంపీడీవో వెంకటేశ్వరరావుకు విన్నవించుకున్నారు. స్పందించిన ఎంపీడీవో పాఠశాలకు కావలసిన కనీస వసతులు ఏర్పాటుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరిత గతిన కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.